నారప్ప చిత్రం సక్సెస్ పై వెంకిమామ ఏమన్నారంటే?

Published on Jul 21, 2021 4:18 pm IST

విక్టరీ వెంకటేష్ హీరో నటించిన నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియో లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న. ఈ చిత్రం పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ మేరకు నారప్ప విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత సంతోషంగా ఉన్నాం అనేది పదాలతో వర్ణించలేం అని వ్యాఖ్యానించారు. నారప్ప పై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. నేను చాలా వినయంగా ఉన్నాను అంటూ చిత్రం సక్సెస్ పై వెంకిమామ స్పందించారు.

అయితే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ప్రియమణి నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా ను నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.

సంబంధిత సమాచారం :