ఒకేసారి రెండు సినిమాలతో రానున్న వెంకీ

ఒకేసారి రెండు సినిమాలతో రానున్న వెంకీ

Published on Oct 20, 2015 12:04 PM IST

venkatesh
విక్టరీ వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్నే అందుకుంది. ఇది రిలీజ్ అయ్యి 10 నెలలు అవుతున్నా వెంకటేష్ తన తదుపరి సినిమాను ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. పలుసార్లు పలు చిత్రాలలో నటించనున్నాడనే వార్తలు వినిపించినా ఏదీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్న వెంకీ ఇప్పుడు తన తదుపరి సినిమాలను మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. అది కూడా ఒకేసారి రెండు సినిమాలను మొదలు పెట్టనున్నాడు.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్ తో ఓ సినిమా చెయ్యడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాము. ఇది కాకుండా రీసెంట్ గా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్ అందుకున్న మారుతితో కూడా ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించాడు వెంకీ. మాకున్న సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ రెండు సినిమాలను దసరా సందర్భంగా అధికారికంగా లాంచ్ చేయనున్నాడు. అలాగే ఈ రెండు సినిమాల షూటింగ్ ని కూడా ఒకేసారి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు