వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా అధికారిక ప్రకటన !

25th, March 2018 - 11:37:17 AM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించబోతున్న వార్త గత కొంతకాలంగా వినిపిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసారు. ఎఫ్ 2 పేరుతో ఈ సినిమా రూపొందించబడుతోంది. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

వెంకటేష్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు బాబి దర్శకత్వంలో మరో మల్టి స్టారర్ సినిమాలో నటించబోతున్నాడు, ఈ మూవీ లో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చెయ్యనున్నారు. అనిల్ రావిపూడి సినిమా పూర్తి స్థాయి వినోదభరితంగా ఉండబోతోందని సమాచారం.