‘అజ్ఞాతవాసి’కి వెంకటేష్ సన్నివేశాలను కలపనున్నారు !
Published on Jan 12, 2018 12:06 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం 10వ తేదీన విడుదలై మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. అభిమానులైతే సినిమా పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానికి తోడు ముందు నుండి చెబుతున్నట్టు సినిమాలో మరొక స్టార్ హీరో వెంకటేష్ సన్నివేశాలు లేకపోవడం ఇంకాస్త నిరుత్సాహానికి గురిచేసింది ప్రేక్షకకుల్ని.

దీంతో చిత్ర యూనిట్ రేపటి నుండి ఆ సన్నివేశాలని సినిమాలో కలపాలని నిర్ణయించుకుంది. దీనికి సంబందించి వెంకీ డబ్బింగ్ చెబుతున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. అలాగే 10 నిముషాలకు పైగానే అనవసరమైన సన్నివేశాల్ని డిలీట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి వెంకీ చేరిక సినిమాకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి. ఇకపోతే మొదటిరోజు ఈ చిత్రం భారీ స్థాయి కలెక్షన్లను రాబట్టింది.

వీడియో కొరకు క్లిక్ చేయండి :

 
Like us on Facebook