కాశ్మీర్ బార్డర్ లో వెంకీమామ టీమ్ !

Published on May 11, 2019 1:02 am IST

బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీమామ. ఇటీవలే ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి అయ్యింది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ కాశ్మీర్ బార్డర్ లో జరుగనుంది. ప్రస్తుతం టీం కాశ్మీర్ లో లొకేషన్స్ ను వెతికే పనిలో వున్నారు. ఇక ఈచిత్రంలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఎమోషనల్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ , నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ దసరా కు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More