ఇంటెన్స్ గ్లింప్స్ తో అదిరిపోయిన “వెంకీమామ 75”

Published on Jan 25, 2023 11:22 am IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు అందరి వెంకీ మామ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని తాను అందుకున్నారు. మరి అలా ఇప్పుడు మరిన్ని చిత్రాలు ఓకే చేయగా వాటిలో లేటెస్ట్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తో ప్లాన్ చేసిన తన బెంచ్ మార్క్ చిత్రం 75వ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ సబ్జెక్ట్ అనౌన్సమెంట్ తోనే మంచి ఆసక్తి రేపగా ఇప్పుడు మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

మరి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. కమల్ కి విక్రమ్ ఎలా అయితే ఓ రేంజ్ కం బ్యాక్ గా అనిపించిందో అదే తరహా ఈ చిత్రం కూడా ఓ సాలిడ్ యాక్షన్ చిత్రంలా కనిపించనున్నట్టు అనిపిస్తుంది. టోటల్ గ్లింప్స్ లో శైలేష్ చూపించిన విజువల్స్ కానీ ఎలివేషన్స్ కానీ సాలిడ్ గా ఉన్నాయి. ఇక వెంకీ మామ అయితే తన ప్రెజెన్స్ తో ఇంటెన్స్ గా కనిపించి మూవీ లవర్స్ తో మంచి ట్రీట్ ఇవ్వడం ఖాయం అన్నట్టుగా అనిపిస్తున్నారు.

ఇక ఇందులో సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా సాలిడ్ విజువల్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రానికి “సైంధవ్” అని టైటిల్ ని అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేయడం విశేషం. దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ మంచి హైప్ ని నిలబెట్టుకునేలా ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ 26 నుంచి ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ కానుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :