మామ అల్లుళ్లు ఆటాపాటా మొదలెట్టారట

Published on Oct 10, 2019 1:32 am IST

ఆఫ్ స్క్రీన్ మామ అల్లుళ్ళు అయిన వెంకటేశ్‌, నాగచైతన్య, ఆన్ స్క్రీన్ మామ అల్లుళ్లుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ వెంకీమామ. దసరా పండుగ పురస్కరించుకొని నిన్న ‘వెంకీ మామ’ చిత్రానికి సంబందించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియో విడుదల చేశారు. మామ అల్లుళ్ళ పల్లెటూరి సరదాలు, పోరాటాలతో కూడిన వీడియో ఆకట్టుకొనేలా ఉంది. చైతూని ఉద్దేశిస్తూ వెంకీ చెప్పిన …”గోదావరిలో ఈత నేర్పా..,బరిలో ఆట నేర్పా..,ఇప్పుడు జాతరలో వేట నేర్పుతా…, డైలాగ్ దుమ్మురేపింది. పక్కా పల్లెటూరిని నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ మూవీ కనిపిస్తుంది.

ఇక టాకీ పార్టు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని పాటలు చిత్రీకరించాల్సి వుంది. కాగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో వెంకీమామ పాటల చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం. వెంకీ, చైతులతో పాటు, హీరోయిన్స్ రాశి ఖన్నా,పాయల్ కూడా ఈ పాటల చిత్రీకణలో పాల్గొంటున్నట్టు సమాచారం.ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తాన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More