వెంకీ క్యారెక్టరే చాలా ఇంట్రస్ట్ !

వెంకీ క్యారెక్టరే చాలా ఇంట్రస్ట్ !

Published on Apr 14, 2019 10:42 PM IST

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వెంకీ – చైతు కాంబినేషన్ లో రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. గతంలోనే ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. ముఖ్యంగా నాగచైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే ఆ పల్లెటూరి సన్నివేశాలు చాలా బాగా అలరిస్తాయట. ఇప్పటికే ఆ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారట.

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు