రవితేజ సినిమాతో చాన్నాళ్ళకి రీఎంట్రీ ఇస్తున్న నటుడు వేణు.!

Published on Jul 29, 2021 1:10 pm IST


ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో రీసెంట్ గా నూతన దర్శకుడు శరత్ మందవతో ప్లాన్ చేసిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రం కూడా ఒకటి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో మంచి బజ్ ను నెలకొల్పుతూ వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ మరి ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్ ని అందించారు.

ఈ చిత్రం లో ప్రముఖ నటుడు మరియు హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నట్టుగా వెల్కమ్ చెప్పారు. దశాబ్ద కాలం కితం వరకు వేణు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ అయితే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటి వేణు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ మరియు రవితేజ ప్రొడక్షన్ వర్క్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :