హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ‘వర్టెక్స్ విరాట్’ (Vertex Viraat) భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. గృహ కొనుగోలుదారుల నిర్మాణ దశ నాటి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, జనవరి 2027 వరకు ‘ఈఎంఐ హాలిడే’ (EMI Holiday) సదుపాయాన్ని అందిస్తోంది. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ ముందుగా బుక్ చేసుకునే మొదటి 50 మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఆధునిక జీవనశైలికి అద్దం పట్టేలా 2, 3 బీహెచ్‌కే ‘ఎక్స్‌ట్రా ఎడ్జ్’ ఇళ్లతో బహుస్థాయి పోడియం కాన్సెప్ట్‌ను ఈ ప్రాజెక్ట్‌లో డిజైన్ చేశారు. ట్రాఫిక్ లేని సురక్షిత వాతావరణం కోసం పోడియం లెవెల్‌లో క్రీడా సదుపాయాలు (స్కేటింగ్ రింక్, ఫుట్‌సాల్ కోర్ట్), స్టిల్ట్ లెవెల్‌లో ఇండోర్ గేమ్స్, జిమ్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫేజ్-1 (టవర్స్ B, C, F) త్వరలో ఇంటీరియర్ పనులకు సిద్ధం కానుండగా, ఫేజ్-2 (టవర్స్ A, E)లో 30 అంతస్తుల నిర్మాణం పూర్తై ఫినిషింగ్ దశలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన మెటీరియల్స్‌ను ఈ నిర్మాణాలు కోసం ఉపయోగిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్‌కు నడిచే దూరంలోనే ఉండటంతో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఐటీ హబ్‌లకు సులభమైన కనెక్టివిటీ ఉంది. మెరుగైన వసతులు, అద్భుతమైన ఆఫర్‌తో వర్టెక్స్ విరాట్ నివాసానికే కాకుండా, పెట్టుబడికి కూడా సరైన ఎంపికగా మారుతోంది.


