సీనియర్ నటి మనోరమ ఇకలేరు.!

సీనియర్ నటి మనోరమ ఇకలేరు.!

Published on Oct 11, 2015 9:52 AM IST

manorama-2
‘అరుంధతి’ సినిమాలో గద్వాల్ రాణి అరుంధతి కథ గురించి చెప్పే చంద్రమ్మ పాత్ర చేసిన మనోరమ గారు గుర్తున్నారా.. స్వతహాగా తమిళ నటి అయిన మనోరమ గారు తెలుగులో కూడా ఎన్నో మరపురాని పాత్రల్లో నటించారు. ఇలా ఎన్నోమంచి పాత్రల్లో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పించిన మనోరమ ఈ రోజు కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మనోరమ గారు ఈ రోజు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. ఆమె మరణంతో మనోరమ గారి కుటుంబం అంతా శోఖ సముద్రంలో మునిగిపోయారు.

మనోరమ గారి ఒరిజినల్ పేరు గోపిశాంత, సినిమాల్లోకి వచ్చాక మనోరమగా పేరు తెచ్చుకున్నారు. 1950- 70ల వరకూ ఆమె హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసారు. ఆ తర్వాత ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఎన్నో మంచి సినిమాలు చేసారు. మనోరమ తన కెరీర్లో సుమారు 1500కి పైగా సినిమాల్లో నటించగా, 100కి పైగా స్టేజ్ షోలు కూడా ఇచ్చారు. తెలుగులో రిక్షావోడు, మనసున్న మారాజు, బావ నచ్చాడు, కృష్ణార్జున, అరుంధతి సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా ‘యముడు’. 1987లోనే ప్రపంచ రికార్డ్ సాధించిన ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది.

మనోరమ గారి మరణంతో శోఖ సముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు