బాలీవుడ్ సీనియర్ నటి కన్నుమూత !


సీనియర్ నటుడు వినోద్ ఖన్నా మరణాన్ని మర్చిపోయేలోపే బాలీవుడ్ పరిశ్రమ మరో సీనియర్ నటి రీమా లాగూని కోల్పోయింది. నిన్న బుధవారం రాత్రి గుండె నొప్పితో ముంబైలోని కోకిల బెన్ ధీరూబాయ్ అంబాని ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల బాలీవుడ్ నటులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

1970, 80ల మధ్య కాలంలో కెరీర్ ప్రారంభించిన రీమా లాగూ అనేక హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. అంతేగాక పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలకు అమ్మ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మైనే ప్యార్ కియా, హమ్ ఆపీకే హాయ్ కౌన్, కుచ్ కుచ్ హోతా హై, హమ్ సాత్ సాత్ హైన్’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారామె. సినిమాల్లోనే కాక టెలివిజన్ రంగంలో సైతం ‘తు తు మైన్, శ్రీమన్ శ్రీమతి’ వంటి పాపులర్ షోలతో తనదైన చెరగని ముద్ర వేశారామె.