విషాదం..కోవిడ్ తో మరో ప్రముఖ సీనియర్ గాయకుడు మృతి.!

Published on May 7, 2021 9:00 am IST

గత ఏడాది కరోనా మూలాన ప్రత్యక్షం గాను పరోక్షం గానూ ఎలాటి ప్రాణ నష్టం వాటిల్లిందో చూసాము. ఎందరో మహనీయులు కరోనా కారణంగా భౌతికంగా దూరం అయ్యారు. మరి వారిలో లెజెండరీ గాయకులు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఒకరు. ఇపుడు ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ప్రముఖ సీనియర్ వెటరన్ గాయకుడు జి ఆనంద్ కరోనాతో మరణించినట్టుగా విషాద వార్త బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా పునాది రాళ్లు నాటి నుంచి అనేక సినిమాలకు తన గాత్రాన్ని ఇచ్చిన ఆనంద్ పలు చిత్రాలకు సంగీతం కూడా అందించారు.ఆయన మరణం పట్ల చిరు కూడా చింతిస్తూ ఓ పోస్ట్ చేశారు. అలాగే శ్రీకాకుళంలో జన్మించిన ఆయన 5 దశాబ్దాల పాటు 6 వేలకు పైగా కచేరీలు కూడా నిర్వహించారు. కానీ ఈ కోవిడ్ సమయంలో సరైన సమయానికి వెంటిలేటర్ అందక మృతి చెందడం నిజంగా విషాదకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు టీం ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :