మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘క్రాక్’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాతి కానుకగా జనవరి 14న విడుదలకానుంది. రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై ప్రేక్షక వర్గాల్లో మంచి హైప్ ఉంది. రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.
ఇక ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఆయన వాయిస్ ఈ మాస్ ఎంటర్టైనర్ కు ఖచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ రేపు కొత్త సంవత్సరం సందర్బంగా విడుదలకానుంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా సముథిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. బి.మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.


