ఇంట్రెస్టింగ్ బయోపిక్ లో విద్యా బాలన్ !

Published on May 8, 2019 3:34 pm IST

బాలీవుడ్ ట్యాలెంటేడ్ నటి విద్యా బాలన్ ఇటీవల ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రలో నటించింది. సినిమా డిజాస్టర్ అయినా విద్యా బాలన్ కు మాత్రం నటన పరంగా మంచి పేరు వచ్చింది.

ఇక ఇప్పుడు విద్యా తాజాగా మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది. హ్యూమన్ కంప్యూటర్ , ప్రముఖ మ్యాథమేటీషియన్ శంకుతల దేవి జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈచిత్రంలో శంకుతల దేవి పాత్రలో విద్యా బాలన్ నటించనుంది. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More