ట్రైలర్ టాక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్న విజయ్ ఆంటోని ‘మార్గన్’

ట్రైలర్ టాక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్న విజయ్ ఆంటోని ‘మార్గన్’

Published on May 28, 2025 9:00 PM IST

mara

తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించే సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే అది ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా కట్ చేశారు. థ్రిల్లింగ్ అంశాలకు పెద్దపీట వేస్తూనే ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఇక విజయ్ ఆంటోని మరోసారి తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయం. ఈ ట్రైలర్‌లో సూపర్ న్యాచురల్ అంశాలు కూడా కనిపించడంతో అసలు ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అవుతుంది.

ఈ సినిమాలో దీప్షిక, అజయ్ దిషన్, సముద్రఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించగా, లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు