పోలీసాఫీసర్ గా కనిపించనున్న విజయ్ ఆంటోనీ !

‘బిచ్చగాడు, డా.సలీం, నకిలీ, భేతాళుడు’ వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో మరొక కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఆ చిత్రమే ‘రోషగాడు’. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. కొద్దిసేపటి క్రితమే చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

గణేశా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈ ఫిబ్రవరి నెలలోనే మొదలుకానుంది. ఇకపోతే తమిళంలో కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న ‘కాళి’ చిత్రం తెలుగులో ‘కాశీ’ పేరుతో తెలుగులో కూడా మార్చి నెలలోనే రిలీజ్ కానుంది.