మరోసారి తన సెన్సేషనల్ డైరెక్టర్ తో రౌడి హీరో..?

Published on Jul 7, 2020 8:03 pm IST

ఇప్పడున్న జెనరేషన్ యువతలో అపారమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యువ హీరోల్లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. ఇండస్ట్రీకి దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన “నువ్విలా” అనే చిత్రంలో ఓ కీలక రోల్ ద్వారా పరిచయమై టాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాడు. అయితే విజయ్ ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “అర్జున్ రెడ్డి” సినిమా అని చెప్పాలి.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డెబ్యూ మూవీతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిన సందీప్ బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం రీమేక్ తో అదిరిపోయే హిట్ ను అందుకున్నాడు. దీనితో విజయ్ మరియు సందీప్ ల కాంబో కు ఒక బ్రాండ్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో నుంచి ఓ చిత్రం వచ్చే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ స్క్రిప్ట్ పనిలో ఉన్నారని అది పూర్తి స్థాయిలో అయ్యాక ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More