దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ?

Published on Jan 27, 2019 6:49 pm IST

మొదటి సినిమా తొలిప్రేమ తో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈచిత్రం తరువాత వెంకీ ,మిస్టర్ మజ్ను చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈచిత్రం తరువాత తన మూడవ చిత్రాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేసుకుంటున్నాడు.

వచ్చే వారంలో విజయ్ కి స్టోరీ నరేషన్ ఇవ్వనున్నాడట ఈ డైరెక్టర్. మరి విజయ్ ఈ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వెంకీ అట్లూరి చిత్రాన్ని కూడా నిర్మించనుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :