విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్

విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్

Published on Oct 31, 2020 12:16 AM IST


డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. జీవితంలో డబ్బు సంపాదిస్తేనే గౌరవం, మంచి లైఫ్ దక్కుతాయనేది ఆయన ఫార్ములా. అందుకే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుని పైకి ఎదగడానికి ట్రై చేస్తుంటాడు. సినిమాలతో పాటే వ్యాపార రంగంలోనూ పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే రౌడీ అనే బ్రాండ్ పేరుతో సొంతగా ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం చేస్తున్న ఆయన తాజాగా కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు.

హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. శుక్రవారం ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో పాల్గొని పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేశాడు. భవిష్యత్తు ఈ ఎలక్ట్రిక్ వాహనాలదే అంటూ వ్యాపారం మీద తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారుచేసే కంపెనీ.

భవిష్యత్తులో ఈ కంపెనీ వాహనాలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ అద్దెతో ఈ వాహనాలను తీసుకోవచ్చు. పైపెచ్చు కాలుష్యం కూడా అస్సలు ఉండదు. మొత్తానికి విజయ్ కొత్త బిజినెస్ ఆకర్షణీయంగానే ఉంది. ఇకపోతే ఈయన ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు