ఆర్ ఎక్స్100 రిజెక్ట్ చేసిన సెన్సేషనల్ హీరో ఎవరంటే?

Published on Jul 12, 2020 6:45 pm IST

యంగ్ హీరో కార్తికేయను హీరోగా నిలబెట్టిన చిత్రం ఆర్ ఎక్స్ 100. న్యూ ఏజ్ లవ్ డ్రామా వచ్చిన ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజీ మూవీ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2018 జులై 12న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. కాగా ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయం చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తెలియజేశారు.

ఆర్ ఎక్స్ 100 మూవీ స్క్రిప్ట్ మొదట హీరో విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లిందట. ఈ విలేజ్ ట్రాజిక్ లవ్ స్టోరీపై విజయ్ దేవరకొండ ఎందుకో ఆసక్తి చూపించలేదట. దీనితో ఈ కథను హీరో కార్తికేయతో చేసి ఆయన బంపర్ హిట్ కొట్టారు. కార్తికేయ రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్ర దర్శకుడు ప్రస్తుతం మహా సముద్రం అనే మూవీ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More