పూరి-విజయ్ మూవీ కోసం భారీ సెట్… !

Published on Feb 14, 2020 9:25 pm IST

విజయ్ దేవరకొండ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ గా నటిస్తుండగా ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ముంబైలో పూర్తి చేశారు. కాగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ కూడా మొదలైందట. ఈ చిత్రం కొరకు ఓ భారీ సెట్ ఏర్పాటు చేయగా అందులో నేడు సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలుపెట్టారట. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత ఛార్మి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు మరియు హిందీతో పాటు పలు భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహార్ వున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :