ఆ విషయంలో జక్కన్నను మించిపోయిన విజయ్ దేవరకొండ

Published on Jul 18, 2019 8:18 am IST

విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్ చిత్రాన్ని వినూత్న రీతిలో భారీగా ప్రచారం చేస్తున్నారు. సౌత్ ఇండియా లోని అన్ని భాషలలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం కొరకు ఆయన రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ మూవీని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే బెంగుళూరు,కొచ్చి నగరాలలో ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగింది. కాగా నేడు చెన్నై వేదికగా ఈ చిత్ర మ్యూజిక్ ఫెస్టివల్ ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సెన్సేషన్ విజయ్ సేతుపతి హాజరయ్యే అవకాశం కలదు.

మరో విశేషం ఏమిటంటే డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఓ పాటను విజయ్ సేతుపతి,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ కలిసి పాడారట. డియర్ కామ్రేడ్ యాన్థం పేరుతో ప్రచారం అవుతున్న ఈ సాంగ్ నేడు 11 గంటల 11 నిమిషాలకు విడుదల కానుందని సమాచారం. ఇలా ఆయా ఇండస్ట్రీలోని ప్రముఖ నటులను ఉపయోగించుకుంటూ విజయ్ తెలివిగా తన సినిమాను అన్ని భాషలలో ప్రచారం ఏర్పడేలా చేస్తున్నాడు.విజయ్ మార్కెటింగ్ స్కిల్స్ చూస్తున్న కొందరు ఆశ్చర్యానికి గురవడమే కాకుండా జక్కన్నను మించిపోయాడు అంటున్నారు. రాజమౌళి బాహుబలి మూవీ ప్రమోషన్ లో కార్పొరేట్ దిగ్గజాలను మించిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో ఆల్ ఇండియా అల్ టైం రికార్డ్స్ సాధించారు. మరి విజయ్ చేస్తున్న ఇంతటి ప్రయత్నం ఎంతటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక విజయ్ హీరోయిన్ గా నటిస్తుండగా,మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈనెల 26న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :