సర్‌ప్రైజింగ్ టీజర్‌ను పట్టుకొస్తున్న ‘రౌడీ జనార్థన్’.. ఎప్పుడంటే..?

సర్‌ప్రైజింగ్ టీజర్‌ను పట్టుకొస్తున్న ‘రౌడీ జనార్థన్’.. ఎప్పుడంటే..?

Published on Dec 15, 2025 3:03 PM IST

SVC59

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రౌడీ జనార్థన్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రవి కిరణ్ కోల డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా, ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ టీజర్‌ను డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ టీజర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు