సోలో వీకెండ్‌ను కొట్టేసిన విజయ్ దేవరకొండ

Published on Jul 21, 2019 3:25 pm IST

సినిమాల్లో నటించడమే కాదు, వాటి ప్రమోషనలను, సరైన సమయానికి విడుదలచేయడాన్ని ప్లాన్ చేసుకోవడంలో విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందే ఉంటారు. పలుసార్లు వాయిదాపడిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని అన్నీ అనుకూలించేలా సోలో వీకెండ్ చూసి విడుదలచేస్తున్నారు. ఈ చిత్రం రిలీజవుతున్న 26వ తేదీ వేరే చిత్రాలేవీ విడుదలకావడంలేదు.

అలాగే గత వరం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ హాఅవుడి కూడా ఈ వరం రోజుల్లో తగ్గుతుంది కాబట్టి దేవరకొండ సినిమాకు ఓపెనింగ్స్ పోటీ కూడా ఉండదు. పైగా మల్టీప్లెక్స్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం మొదలుపెట్టేశారు. మరోవైపు భారీ ప్రమోషన్లు. వెరసి ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని విజయానికి దగ్గరగా చేసే అవకాశాలున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :