లుక్ మార్చనున్న విజయ్ దేవరకొండ !

Published on Sep 22, 2020 12:03 am IST

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం కలయికలో రానున్న సినిమా ‘ఫైటర్’. కాగా విజయ్ తన ఫైటర్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఓ న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు. పూర్తిగా హెయిర్ తీసేసి.. గుండె లుక్ లో ఒక బాక్సర్ లా కనిపిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతొంది. అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో మొదలుకానున్న షెడ్యూల్ కోసమే విజయ్ తన లుక్ ను మార్చబోతున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తూనే… అటు బిజినెస్ మేన్ గానూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాల బ్యాలెన్స్ డ్ గా కెరీర్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రనువేశాడు. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ఈ సినిమాని చేస్తున్నాడు.

కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More