భారీ స్థాయిలో రిలీజ్ కానున్న విజయ్ దేవరకొండ చిత్రం !
Published on Mar 6, 2018 3:40 pm IST

‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్లతో ప్రస్తుతం సూపర్బ్ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాల కంటే ముందే చేసిన చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. కొన్ని అనివార్య కారణాల వలన వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 9న విడుదలకానుంది. ఆలస్యం సంగతి అటుంచితే ప్రస్తుతం విజయ్ కు యువతలో ఏర్పడ్డ మంచి క్రేజ్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడనుంది.

అంతేగాక చిత్ర నిర్మాతలు సినిమాను సుమారు 650 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ భారీ స్థాయి విడుదలతో డిస్ట్రిబ్యూటర్లు ఓపెనింగ్స్ రూపంలోనే పెట్టుబడిలో ఎక్కువ మొత్తాన్ని వెనక్కు రాబట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని శశిధర్ మర్రి డైరెక్ట్ చేయగా విజయ్ కు జోడీగా శివానీ సింగ్ నటించింది.

 
Like us on Facebook