స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. తాజా అప్ డేట్ ప్రకారం, ఏపీ సాధారణ ఎన్నికలు మరియు వాటి ఫలితాల తర్వాత ఈ సినిమాను దూకుడుగా ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్లకు సంబంధించి టీమ్ ఇప్పటికే పక్కా ప్లాన్ తో షెడ్యూల్ కూడా వేసుకుందట. రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి నటీనటులు కూడా ముందు నుంచే ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.
కాగా ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు శంకర్. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు.
మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. థమన్ సంగీత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.