స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు కొరటాల శివ. అందులో భాగంగానే వచ్చే షెడ్యూల్ లో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ కూడా చాలా ట్రెండీగా ఉంటాయని.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. మే నాలుగో వారం నుంచి ఈ షెడ్యూల్ తాలూకు సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే, ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.