విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. ఐతే, ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఇండియన్ 2 లో కమల్ క్యారెక్టర్ గురించి చాలా చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను రామ్ చరణ్ చెప్పబోతున్నాడు అని తెలుస్తోంది. ఈ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని, అలాగే కమల్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోందని తెలుస్తోంది.
అందుకే, ఈ వాయిస్ ఓవర్ ను రామ్ చరణ్ చెబుతున్నారట. చరణ్ – శంకర్ కలయికలో గేమ్ చేంజర్ వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, చరణ్ ఇండియన్ 2 కోసం తన వాయిస్ ని వినిపించబోతున్నాడట. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు, కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘ఇండియన్ 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది.