థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on May 6, 2024 12:00 PM IST

ఈ మే రెండో వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

‘కృష్ణమ్మ’ :

సత్యదేవ్‌ కథానాయకుడిగా వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ప్రతినిధి 2’ :

నారా రోహిత్‌ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’. ఈ సినిమాని మే 10న విడుదల చేస్తున్నారు.

జితేందర్‌రెడ్డి’ :

ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’. ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ది గోట్‌(వెబ్‌ సిరీస్‌) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

8ఏఎం. మెట్రో (హిందీ) మే 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌)మే 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌ గేట్‌ప్లే :

ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) మే 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు