బడ్జెట్ సమస్య వలనే దేవరకొండ చిత్రం ఆగిందా ?

Published on Feb 20, 2020 8:12 am IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గతంలో పలు ప్రాజెక్టులకు కమిటైన సంగతి తెలిసిందే. వాటిలో ‘హీరో’ కూడా ఒకటి. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి పూనుకుంది. షూటింగ్ కూడా కొంత భాగం జరిగింది.

కానీ ఉన్నట్టుండి చిత్రానికి బ్రేకులు పడ్డాయి. ఇప్పటివరకు షూటింగ్ రీస్టార్ట్ కాలేదు. చిన్న విరామమే.. త్వరలో మొదలవుతుందని మొదట్లో చెబుతూ వచ్చిన టీమ్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. విజయ్ సైతం పూరి డైరెక్షన్లో ‘ఫైటర్’ స్టార్ట్ చేశారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు ప్రాజెక్ట్ ఆగిపోనట్టేనని తెలుస్తోంది. ఇందుకు బడ్జెట్ సమస్యలు ప్రధాన కారణమని కూడా అంటున్నారు. మరి నిజంగానే చిత్రం బడ్జెట్ సమస్యల వలం ఆగిపోయిందా లేకపోతే కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చారా అనేది తెలియాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.

సంబంధిత సమాచారం :