కుడి ఎడమైతే వెబ్ సిరీస్ పై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు!

Published on Jul 23, 2021 4:22 pm IST

ఇటీవల కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఎక్కువగా ఆదరణ పొందుతోంది కుడి ఎడమైతే వెబ్ సిరీస్. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మొదటి ఎపిసొడ్ నుండి ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ పై ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ను తాజాగా చూసినట్లు తెలిపారు. చాలా ఆకట్టుకుంది అని అన్నారు. అయితే ఇది తెలుగు లో ఉన్న వెబ్ సిరీస్ లలో గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమలాపాల్ మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :