పుష్పక విమానం కి విజయ్ సరికొత్త ప్రమోషన్స్!

Published on Nov 6, 2021 12:29 am IST

విజయ్ దేవరకొండ నిర్మాణం లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్పక విమానం. ట్రైలర్ తోనే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తి కరంగా ఉండటం తో సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు మేకర్స్.

పుష్పక విమానం ట్రైలర్ కీ వస్తున్న ఆదరణ పట్ల విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ సినిమా కు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే సంధించండి అంటూ చెప్పుకొచ్చారు. ఆనంద్ మరియు తను ప్రశ్నలకు సమాధానం ఇస్తాం అని అన్నారు. పండుగ సందర్భంగా ఆన్లైన్ వేదిక గా ప్రమోషన్స్ చేస్తుండటం తో సరికొత్త ప్రమోషన్స్ పై నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 12 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :