సెట్ లో తన బర్త్ డే ను జరుపుకున్న యంగ్ హీరో !

Published on May 9, 2019 3:28 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల డియర్ కామ్రేడ్ షూటింగ్ ను పూర్తి చేసి ప్రస్తుతం ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవల రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈరోజు విజయ్ 30వ పుట్టిన రోజు కావడంతో సినిమా యూనిట్ తన బర్త్ డే ను సెట్ లో సెలెబ్రేట్ చేశారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కాథరిన్ , ఇజబెల్లి కథానాయిలుగా నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ పతాకం ఫై కె ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More