రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’ !

Published on May 8, 2019 4:08 PM IST

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసందే. కాగా తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది.

కాగా ఈ చిత్రంలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ తెరక్కిస్తున్న కొత్త చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు