ఈ హిట్ కాంబినేషన్.. సాధ్యమైనంత త్వరలో.. ?

ఈ హిట్ కాంబినేషన్.. సాధ్యమైనంత త్వరలో.. ?

Published on Apr 14, 2019 6:09 PM IST

‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్ ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. నాగచైతన్య పిలిచి మరి ఆఫర్ ఇచ్చినా.. ‘ఒక లైలా కోసం’ అంటూ ప్లాప్ చిత్రాన్ని తీశాడు.

దాంతో మొదటి సినిమాకు వచ్చిన పేరు కాస్త పోయింది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా మొత్తానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు విజ‌య్ కుమార్ కొండా.

ఎట్టకేలకూ మళ్లీ నితిన్ తో తన సినిమాను త్వరగా పట్టాలెక్కించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ ను నితిన్ కు వినిపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్.. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు