తలపతి 63 లేటెస్ట్ అప్డేట్ !

Published on May 5, 2019 4:00 am IST

ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘తలపతి 63’ సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇక వార్తలను ఖడించిన చిత్ర బృందం అదే సెట్ లో షూటింగ్ ను స్టార్ట్ చేసింది . ఈ నాల్గవ షెడ్యూల్ సుమారు 50 రోజుల పాటు ఈవీపి స్టూడియోస్ భారీ ఫుట్ బాల్ స్టేడియంలో జరుగనుంది. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22 న విడుదల చేయన్నారని సమాచారం.

అట్లీ తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం దీపావళికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More