యుఎస్ఏ ప్రీ సేల్స్ లో దూసుకెళ్తున్న ‘విజయ్’ లియో

le0

ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ లియో అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న లియో నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, లియోకి సంబంధించి ప్రీ రిలీజ్ సేల్స్ ప్రస్తుతం యుఎస్ఏ లో భారీగా రెస్పాన్స్ తో కొనసాగుతున్నాయి.

తాజాగా ఈ మూవీ యొక్క ప్రీ సేల్స్ అక్కడ 700కె వరకు చేరుకున్నట్లు తాజాగా యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. కాగా లియో ని అక్కడ ప్రత్యంగిరా సినిమాస్, ఏ ఏ క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. అర్జున్ సర్జా, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, మాథ్యూ థామస్, ప్రియా ఆనంద్, శాండీ మాస్టర్, బాబు ఆంటోని, మనోబాల, జార్జ్ మేరియన్, అభిరామి వెంకటాచలం, జాఫర్ సాదిక్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఏ స్థాయిలో ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

Exit mobile version