ఆ దర్శకుడితో విజయ్ మీటింగ్.. ఇప్పుడిదే హాట్ టాపిక్

Published on Dec 5, 2020 3:00 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ ఫెవరెట్ దర్శకుల్లో యువ దర్శకుడు అట్లీ కూడ ఒకరు. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. మొదటి సినిమా ‘రాజా రాణి’ తరవాత అట్లీ వరుసగా మూడు సినిమాలు విజయ్ తోనే చేశారు. ‘తేరి, మెర్సల్, బిగిల్’ మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే వీరిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి సినిమా వస్తుందంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అట్లీ, విజయ్ ఇద్దరు కూడ ఎప్పటికప్పుడు తమ కలయికలో తర్వాతి సినిమాను ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ అట్లీ కార్యాలయానికి వెళ్లి ఆయన్ను వ్యక్తిగతంగా కలవడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలవడంతో కొత్త సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, విజయ్ తర్వాతి సినిమా అట్లీతోనేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమా విడుదల సన్నాహాల్లో ఉన్నారు. తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తారనే టాక్ కూడ ఉంది. మరోవైపు అట్లీ షారుఖ్ ఖాన్ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. దీన్నిబట్టి ఈ సినిమాలు పూర్తయ్యాక ఇద్దరూ కలిసి పనిచేయడానికి అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత సమాచారం :

More