దేవరకొండ ను రీప్లేస్ చేసిన తమిళ హీరో !

Published on Jan 6, 2019 10:08 am IST

ఇండియన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథతో తెరెకెక్కునున్న చిత్రం ’83’. బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని ఖబీర్ ఖాన్ తెరకెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇవి రూమర్లు మాత్రమే అని తేలిపోయింది. తాజాగా ఈ పాత్రకు తమిళ హీరో ‘రంగం’ ఫేమ్ జీవా ను తీసుకున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో కపిల్ బాల్యం తో పాటు 1983 ప్రపంచకప్ ను గెలవడం లో ఎలాంటి పాత్ర పోషించారనే విషయాలను చూపించనున్నారు.

‘ఎన్టీఆర్ బయోపిక్’ సహా నిర్మాత విష్ణు ఇందూరి నిర్మించనున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ రన్వీర్ కు కోచ్ గా నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే రోజు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More