రాయణంగారి హుందాతనం మాములుగాలేదుగా..!

Published on Apr 2, 2020 10:37 am IST

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన పై అంచనాలు బాగానే ఉన్నాయి. దేవిశ్రీ అందించిన సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండగా, వైష్ణవ్, కృతి శెట్టి జంట చక్కగా ఉన్నారు. ఈ మూవీలో తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన చిత్రంలో రాయణం అనే జమిందారు రోల్ ఆయన చేస్తుండగా ఆయన లుక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఉప్పెనలో విజయ్ సేతుపతి రోల్ ప్రత్యేకంగా నిలవనుందని తాజా పోస్టర్స్ ని చూస్తే అర్థం అవుతుంది.

అలాగే విజయ్ సేతుపతిది ఈ మూవీలో విలన్ రోల్ అని కూడా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా దర్శకుడు బుచ్చి బాబు సానా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కావాల్సివుండగా కరోనా కర్ఫ్యూ కారణంగా వాయిదా పడింది. వచ్చే నెలలో వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More