కేక్ కట్ చేసి ఇరుక్కుపోయిన విజయ్ సేతుపతి

Published on Jan 16, 2021 11:30 pm IST

తమిళ నటుడు విజయ్ సేతుపతి స్టార్ డమ్ అన్ని పరిశ్రమలకు వ్యాపిస్తోంది. తమిళం నుండి తెలుగులోకి వచ్చిన ఆయన త్వరలో బాలీవుడ్లోనూ అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన మూడు ఇండస్ట్రీల్లోనూ మంచి సినిమాలను కలిగి ఉన్నారు. గత రెండు మూడేళ్ళలో ఆయన క్రేజ్ బాగా పెరిగింది. అందుకే ఆయన ఏది చేసినా న్యూస్ అయిపోతోంది. వివాదాలకు ఊరికే దొరికేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం సేతుపతి మురళీధరన్ బయోపిక్ చేయబోయి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. తీవ్ర ఒత్తిడి నడుమ చివరకు సినిమా నుండి డ్రాప్ అయ్యారు.

ఇక తాజాగా ఆయన ఇంకొక వివాదంలో ఇరుక్కున్నారు. సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఆయన పనిచేస్తున్న సినిమా బృందాలు ఆయనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. అలా ఒక చిత్ర యూనిట్ ఆయనకు పెద్ద ఖడ్గం చేతికిచ్చి కేక్ కట్ చేయించారు. ఆ ఫోటోలు బయటికోచ్చాయి. ఇంకేముంది సేతుపతి యువతీయువకుల్లో హింసాత్మక భావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఒకటే విమర్శలు. దీంతో స్పందించిన ఆయన ఆ కత్తి తాను ఒక సినిమాలో వాడుతున్న ప్రాపర్టీ అని క్లారిటీ ఇచ్చి నన్ను చూసి యువతీయువకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నా ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. క్షమించండి అన్నారు.

సంబంధిత సమాచారం :

More