రాశి ఖన్నా తో వెబ్ సిరీస్ లో నటించనున్న విజయ్ సేతుపతి!

Published on Aug 1, 2021 10:08 pm IST


ప్రస్తుతం ఓటిటి హవా నడుస్తుంది అని చెప్పాలి. సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లు సైతం వస్తూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ఎన్నో వెబ్ సిరీస్ లు భారతీయ ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ నటి రాశి ఖన్నా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీ కే దర్శకత్వం లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటికే షాహిద్ కపూర్ నటిస్తున్నారు. రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ లోకి ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి సన్ని అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఇందుకు నటించడం అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే విజయ్ సేతుపతి వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఈ సన్ని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :