విజయ్ సేతుపతి – తాప్సీ ల హార్రర్ కామెడీ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల!

Published on Jul 21, 2021 1:16 pm IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిత్ర దర్శక నిర్మాతలు సినిమాలని ఓటిటి లో విడుదల చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి మరియు తాప్సీ లు ఇద్దరు కలిసి నటిస్తున్న హార్రర్ కామెడీ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :