దీపావళి కి విడుదలకానున్న స్టార్ హీరోల సినిమాలు !

దీపావళి కి విడుదలకానున్న స్టార్ హీరోల సినిమాలు !

Published on Jun 20, 2018 9:29 PM IST


కోలీవుడ్ లో ఈ దీపావళికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నాయి దానిలో మొదటిది సెల్వ రాఘవన్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘ఎన్ జి కే’ చిత్రం. వైవిధ్యమైన కథ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫై మంచి అంచనాలు వున్నాయి ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి ,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు ఈ చిత్రం దీపావళి కి విడుదల కానుంది ఈ చిత్రం తో పాటు ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం కూడా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన కత్తి ,తుపాకీ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి ఇక ఈ చిత్రం ఫై కూడా భారీ అంచనాలే వున్నాయి.ఈ చిత్ర టైటిల్ , ఫస్ట్ లుక్ ని రేపు విడుదలచేయనున్నారు .

వీటితో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన ‘ధ్రువ నట్చత్తిరమ్’ చిత్రం కూడా దీపావళి కి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . ఇంకా ఈ సినిమా విడుదల ఫై అధికారికంగా సమాచారం అందలేదు . మరి ఈ దీపావళి కి ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరుగరాస్తాయో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు