మాస్టర్’ ప్లాన్ వేస్తున్న విజయ్..!

Published on Jul 10, 2020 12:03 am IST

గత ఏడాది బిగిల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ లో నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన కాలేజ్ ప్రొఫసర్ గా మరియు గ్యాంగ్ స్టర్ గా రెండు భిన్న షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం మరో విశేషం.

ఐతే ఈ మూవీ ఓ టి టి లో విడుదల అవుతుందని చాలా కాలంగా ప్రచారం నడుస్తుంది. థియేటర్స్ ఇప్పట్లో తెరుచుకోనే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో నిర్మాతలు ఓ టి టి విధులకు సిద్ధమయ్యారని కథనాలు రావడం జరిగింది. దీనిపై నిర్మాతలు మరో మారు స్పష్టత ఇచ్చారు. మాస్టర్ మూవీ ఓ టి టి లో విడుదల చేసే ఆలోచన లేదనీ…2020 దీపావళి లేదా 2021 సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు.

సంబంధిత సమాచారం :

More