ఆటోడ్రైవర్ల పట్ల ఆ స్టార్ హీరో ఔదార్యం భేష్…!

Published on May 27, 2019 11:44 am IST

తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ ఆటో డ్రైవర్ల కొరకు ప్రతి సంవత్సరం మే డే రోజున లంచ్ ఏర్పాటు చేస్తాడు. ఐతే ఈ సారి కొన్ని అనివార్య కారణాల వలన ఆ కార్యక్రం వాయిదా పడటంతో నిన్న చెన్నైలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది ఆటో డ్రైవర్స్ ని ఓ మెమెంటో సత్కరించారంట. ప్రతి సంవత్సరం తమను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తున్న విజయ్ ని ఆటో డ్రైవర్స్ ప్రశంసలతో ముంచెత్తారు.

ఐతే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 63 వ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్న విజయ్ ఈ కార్యక్రమానికి రాకపోవడం తో ఆటో డ్రైవర్స్ ఒకింత నిరుత్సాహానికి గురైనారట. ఐతే విజయ్ ఛారిటీ సంస్థ మక్కల్ ఇయక్కం ప్రతినిధులు విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారంట. పదేళ్ల క్రితం వచ్చిన “వేట్టైకరన్” మూవీలో విజయ్ ఆటోడ్రైవర్ గా నటించారు.

సంబంధిత సమాచారం :

More