తలపతి విజయ్ “వాతి కమింగ్” సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డ్!

Published on Jul 18, 2021 7:42 pm IST

తలపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లోని వాతి కమింగ్ పాట యూత్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాట ను యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసి అయిదు నెలలు దాటుతున్నా రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో 225 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 2.4 మిలియన్ ల లైక్స్ ను సాధించింది. అయితే ఇప్పటి వరకూ లేని విధంగా ఈ పాట కి యూ ట్యూబ్ లో 358కే కామెంట్స్ రావడం విశేషం. అయితే సౌత్ ఇండియా లో ఇప్పటి వరకూ రౌడీ బేబీ పాట కి 263 కే కామెంట్స్ రాగా, బుట్ట బొమ్మ పాట కి 300 కే కామెంట్స్ రాగా, ఎంజాయ్ ఎంజామి పాటకి 198 కే కామెంట్స్ వచ్చాయి.

అయితే ఈ పాట ఈ స్థాయి లో అభిమానులను ఆకట్టుకోవడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో విజయ్ సరసన మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, యాండ్రియా కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :