“విజయ రాఘవన్” ట్రైలర్ తో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ!

Published on Aug 2, 2021 6:40 pm IST

విజయ్ ఆంటోనీ మరియు ఆత్మిక హీరొ హీరోయిన్ లుగా ఆనంద కృష్ణన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విజయ రాఘవన్. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. అయితే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా, ఉత్కంఠ గా సాగింది. అయితే పొలిటికల్ యాంగిల్ కూడా ఉండటం తో సినిమా లో సోషల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు సైతం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో ప్రతినాయకుడు పాత్ర లో కేజీఎఫ్ ఫేం గరుడ రామ్ నటిస్తున్నారు. అయితే ట్రైలర్ విడుదల అవ్వడం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రం ట్రైలర్ గట్టి ఇంపాక్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :